📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలి: పగడాల వెంకటరామిరెడ్డి, ప్రసాద్ ధ్వజం..

వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలి: పగడాల వెంకటరామిరెడ్డి, ప్రసాద్ ధ్వజం..

📰 Generate e-Paper Clip

వినకొండజూలై 03 ప్రజావాణి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను, అభివృద్ధిని గాలికొదిలేసి ప్రతిపక్ష నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని (వైసీపీ) రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి,ప్రముఖ న్యాయవాది & పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ప్రసాద్,తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.వినుకొండలో శుక్రవారం వైసీపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని విమర్శించారు.రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తల ఇళ్లను కూల్చివేయడం,తప్పుడు కేసులు పెట్టడం మినహా ప్రజలకు చేసిన మేలేమీ లేదని మండిపడ్డారు. వినకొండ నియోజకవర్గ పరిధిలోని సుమారు 18 పెద్ద చెరువులను,దాదాపు 10 వేల ఎకరాల విస్తీర్ణాన్ని గత 20,25 సంవత్సరాలుగా తమ గుప్పెట్లో పెట్టుకుని కోట్ల రూపాయల చేపల దందాకు పాల్పడ్డారని వెంకటరామిరెడ్డి,ప్రసాద్ ఆరోపించారు.బడుగు, బలహీన వర్గాల జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన మత్స్యకార సొసైటీలను తమ కుటుంబ సభ్యుల పేర్లపైకి మార్చుకుని,వాటిని తాకట్టు పెట్టడం ఎలాంటి వ్యాపారమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సాధారణ కౌలు లెక్కన చూసినా పాతిక సంవత్సరాలలో వినుకొండ నియోజకవర్గానికి రూ.25 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గత ప్రభుత్వంలో పట్టుబట్టిన తర్వాతే కొన్ని చెరువులను వదిలేశారని,ఇప్పటికీ కొన్ని చెరువులు అధికార పార్టీ అనునయుల చేతుల్లోనే ఉన్నాయని మండిపడ్డారు.పెదకంచెర్ల చెరువు పరిధిలోని వందలాది ఎకరాల భూములను కట్టలేసి ప్రైవేట్ వ్యక్తులుగా అనుభవిస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.చట్టబద్ధమైన అనుమతులతో,ప్రభుత్వానికి ఫీజులు చెల్లించి నిర్మించుకున్న ఇళ్లను ఆక్రమణలుగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు.మక్కెన మల్లికార్జునరావు తన విద్యార్హతలపై అబద్ధాలు చెప్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని నాయకులు ఆరోపించారు.2014 ఎన్నికల అఫిడవిట్‌లో 1998లోనే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసినట్లు పేర్కొన్న మల్లికార్జునరావు, పదేళ్ల తర్వాత 2024లో నాగార్జున విశ్వవిద్యాలయం నుండి తొలిసారి పట్టా అందుకున్నట్లు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం వెనుక ఉన్న మర్మమేంటని ప్రశ్నించారు.వినుకొండ నియోజకవర్గంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని,రషీద్ హత్య ఉదంతమే ఇందుకు సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు.బాధితులకు భరోసా ఇవ్వాల్సింది పోయి, రషీద్ అన్న ఖాదర్ బాషాను తప్పుడు కేసుల్లో ఇరికించి అతని ఉద్యోగం తీసేయించడం ఏ రకమైన మానవత్వమని నిలదీశారు.కారుమంచి గ్రామం మరియు టి అన్నారు గ్రామ పరిధిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమంగా 307 కేసులు బనాయిస్తూ,సొంత పార్టీ వారిపై మాత్రం స్టేషన్ బెయిల్ వచ్చే సాధారణ కేసులు పెడుతూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రసాద్ విమర్శించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 700 రోజులు దాటినా వినకొండ కొండపై పురాతన మెట్ల పునరుద్ధరణ గానీ,ఘాట్ రోడ్డు పనులు గానీ పూర్తి చేయలేకపోయారని వెంకటరామిరెడ్డి, విమర్శించారు.మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో అద్భుతమైన శిల్పకళతో సగం వరకు నిర్మించిన ప్రాచీన గుడి గోపురాన్ని,ఇప్పుడు ఇటుకరాళ్లతో గబగబా నిర్మించి మమ అనిపించాలని చూడటం వారి తొందరపాటుతనానికి నిదర్శనమన్నారు.వెల్లటూర్ రోడ్డులో లెదర్ పార్క్ తెస్తామని చెప్పి మాట తప్పారని,100 పడకల ఆసుపత్రి అనుమతులు ఉన్నా ఇంతవరకు దాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. మున్సిపల్ అనుమతులు ఉన్న కళ్యాణ మండపాలు,ఇళ్లపై అక్రమ ముద్ర వేస్తున్నారని, వెల్లటూరు ,పలు ప్రాంతాల్లో కేవలం రాజకీయ కక్షలతో పేద ప్రజల,ఎస్టీల ఇళ్లను జేసీబీలతో నేలమట్టం చేశారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500,కొత్త వితంతు పెన్షన్ల వంటి హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ఇప్పటికైనా పోలీసులను,అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరింపులకు పాల్పడటం మానుకోవాలని,ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని హెచ్చరించారు.వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి,ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి అందేలా చూడటంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.ఈ కార్యక్రమం లో వినుకొండ రూరల్ మండలం జడ్పీటీసీ రాజేశ్వరరావు (రాజా),పల్నాడు జిల్లా  విభాగం ప్రధాన కార్యదర్శి,వైస్ చైర్మన్, బేతం గాబ్రెల్,పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తలారి ఆంజనేయులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.