📄 ePaper
Saturday, July 4, 2026
📄 ePaper
HomeతెలంగాణPeddapalliసేవలో కొత్త చరిత్ర సృష్టించిన లయన్స్ క్లబ్

సేవలో కొత్త చరిత్ర సృష్టించిన లయన్స్ క్లబ్

📰 Generate e-Paper Clip

సేవలో కొత్త చరిత్ర సృష్టించిన లయన్స్ క్లబ్
-సభ్యుల సహకారంతో ఒకే రోజు 101 సేవా కార్యక్రమాలు.
-క్లబ్ అధ్యక్షురాలు డా. శరణ్య యాదవ్.

రామగిరి, మన సమగ్ర ప్రజావాణి జూలై 02

నూతన లయోనిస్టిక్ సంవత్సరం ప్రారంభం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీకాలనీ అధ్యక్షురాలు డా.శరణ్య యాదవ్ ఆధ్వర్యంలో,జిల్లా గవర్నర్ లయన్ మోర భద్రేశం పిలుపు మేరకు ఒకే రోజు 101 వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వెల్ఫేర్ ఆఫీసర్ తుల ప్రీతి,కల్వచర్ల గౌడ సంఘం మాజీ అధ్యక్షుడు బూర్గు భూమయ్య,బేగంపేట గ్రామానికి చెందిన గుండా సరిత లయన్స్ క్లబ్ సభ్యత్వాన్ని స్వీకరించగా, వారికి డా.శరణ్య యాదవ్ ఇంటర్నేషనల్ సభ్యత్వ సర్టిఫికెట్లు,లయన్స్ క్లబ్ పిన్‌లను అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమాల్లో భాగంగా నిత్యావసర సరుకుల పంపిణీ,పోషకాహార పంపిణీ, ప్రముఖుల సన్మానం, నిరుపేదలకు బీమా సదుపాయం కల్పించడం, మొక్కలు నాటడం,ప్లాస్టిక్ నిర్మూలన కోసం క్లాత్ మరియు పేపర్ బ్యాగుల పంపిణీ,పుస్తకాల పంపిణీ, మొక్కల పంపిణీ, డయాబెటిస్ వైద్య శిబిరాలు, నేత్రదాన అవగాహన,హెల్మెట్ అవగాహన,చైల్డ్ క్యాన్సర్ అవగాహన,పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు తదితర 101 సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
పన్నూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రూ.25 వేల విలువైన వాటర్ ప్యూరిఫైయర్‌ను దాతలు కూన్‌సోత్ లలిత కృష్ణ,మర్రి సుధారాజు సహకారంతో ఏర్పాటు చేయడం విశేషం.
ఈ సందర్భంగా డా.శరణ్య యాదవ్ మాట్లాడుతూ…సేవే లయన్స్ క్లబ్ యొక్క ప్రధాన లక్ష్యం.సమాజంలోని ప్రతి వర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం మా బాధ్యతగా భావిస్తున్నాం. సభ్యులందరి సహకారం, దాతల ప్రోత్సాహంతో ఒకే రోజు 101 సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని,రాబోయే రోజుల్లో కూడా విద్య, ఆరోగ్యం,పర్యావరణ పరిరక్షణ,పేదల సంక్షేమం కోసం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టి సమాజ అభివృద్ధికి మా వంతు కృషి కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కాటం సత్యం, కోశాధికారి సురేష్ బాబు, ఉపాధ్యక్షుడు బుచ్చన్న పటేల్,డిస్ట్రిక్ట్ కమిటీ చైర్‌పర్సన్ మేకల మారుతి యాదవ్,వివిధ కమిటీల చైర్‌పర్సన్లు గంట వెంకటరమణారెడ్డి, మొలుమూరి శ్రీనివాస్,గుండ శ్రీనివాస్,మాచర్ల లావణ్య, పట్నం వసుంధర, లక్ష్మీనారాయణ,మర్రి శరణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular