📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

*లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు ఘన సన్మానం*

*మన ప్రజావాణి*
మందమర్రి:- జూలై 1

పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో  బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సోత్కు సుదర్శన్ రావు, మందమర్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడు పెండ్యాల గౌతమ్ చారి, కోశాధికారి బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లు బింగి రాజన్న  కొక్కుల మధు ల ఆధ్వర్యంలో పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు ను మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజలింగు మాట్లాడుతూ, సమాజ సేవలో లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయమన్నారు. అదేవిధంగా ఇటీవల మందమర్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పెండ్యాల గౌతమ్, కోశాధికారి ఎన్నికైన బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లుగా ఎన్నికైన బింగి రాజన్న, కొక్కుల మధు లకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వారి పదవీకాలంలో క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.