📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyచిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📰 Generate e-Paper Clip

*చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*

*షాద్‌నగర్ నియోజక వర్గంలో ఘనంగా పల్స్ పోలియో కార్యక్రమం*

*నిరుపేదల గుడిసెల వద్దకే వెళ్లి పల్స్ పోలియో చుక్కలు వేసిన వైద్య సిబ్బంది*
షాద్ నగర్ ప్రజావాణి  జూన్ 28 :
జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా షాద్‌నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. వైద్యాధికారుల సమక్షంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా భవిష్యత్ తరాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షాద్‌నగర్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలియో చుక్కలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

*నియోజకవర్గ వ్యాప్తంగా..*

షాద్ నగర్ డివిజన్ లో 0 నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులు మొత్తం 35,267 మంది ఉన్నారు. మొత్తం పోలియో బూత్‌లు 290 ఉండగా, రూట్ సూపర్వైజర్లు  30 మంది పర్యవేక్షిస్తుండగా మొత్తం వైద్య సిబ్బంది 514 మంది, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 1,160 మంది, ట్రాన్సిట్ పాయింట్లు 11 ఉండగా మొబైల్ టీమ్‌లు 6 ఉండగా నియోజకవర్గంలోని ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేయడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.