📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్హనుమంతపురంలో అధ్వానంగా పారిశుధ్యం..సీజనల్ వ్యాధుల భయం

హనుమంతపురంలో అధ్వానంగా పారిశుధ్యం..సీజనల్ వ్యాధుల భయం

📰 Generate e-Paper Clip

తిరుపతి (జూన్ 28 ప్రజావాణి) స్టాప్ రీపోటర్ మురళి పిచ్చాటూరు మండలం హనుమంతపురం గ్రామంలో పారిశుధ్య పరిస్థితి పూర్తిగా దిగజారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హనుమంతపురం వీధులు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతోంది. ఇటీవల కాలువల్లో పూడిక తీసినప్పటికీ ఆ చెత్తను అక్కడికక్కడే వదిలేయడంతో పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ప్రజలు చెబుతున్నారు కాలువల పక్కనే పేరుకుపోయిన చెత్త కుప్పల వల్ల దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాలు కురిసిన సమయంలో మురుగునీరు ఇళ్ల వద్దకు చేరే పరిస్థితి నెలకొంటోందని వాపోయారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి, పారిశుధ్య చర్యలు చేపట్టడంతో పాటు శాశ్వత డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని హనుమంతపురం బీసీ కాలనీ ప్రజలు కోరుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.