📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSangareddyమొహర్రం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

మొహర్రం వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి

పటాన్‌చెరు, జూన్ 26(ప్రజావాణి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని రామచంద్రాపురంలో నిర్వహించిన పవిత్ర మొహర్రం వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, మొహర్రం త్యాగం, ధర్మం, న్యాయం, మానవతా విలువలకు ప్రతీక అని అన్నారు. సమాజంలో సోదరభావం, ఐక్యత, పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తోంట అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పరమేశ్ యాదవ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular