కడప జూన్ 26 ప్రజావాణి యుటిఎఫ్ భవన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్సీటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని,దీనిపై కొందరు ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు.టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయులకు ఆందోళన అవసరమేలేదని, బోధనలో అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం పెద్ద సమస్యేమి కాదన్నారు.అయితే విద్యాబోధన ఒకవైపు, కుటుంబ బాధ్యతలు మరొక వైపు చూస్తూ టెట్ పరీక్షకు ప్రిపేర్ కావడం కొంత ఇబ్బందికరమని పేర్కొన్నారు.ఇలాంటి సందర్భంలో ఉపాధ్యాయుల్లో ఉన్న భయాందోళనలను పోగొట్టాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయ సంఘాలపై ఉందన్నారు.ఇందులో భాగంగా యుటిఎఫ్ ఉపాధ్యాయులకు ఉచిత కోచింగ్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.గతంలో కూడా యుటిఎఫ్ కడప జిల్లా శాఖ పక్షాన నిరుద్యోగులకు డీఎస్సీ ఉచిత కోచింగ్ ను నిర్వహించి నిరుద్యోగుల మన్ననలను అందుకున్నారన్నారు. యుటిఎఫ్ ఒకవైపు ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాటాలు చేస్తూనే, మరోవైపు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమన్నారు. ఉపాధ్యాయ సంఘాల కృషి వల్ల ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహకాలు చేస్తున్నదని తెలిపారు.యుటిఎఫ్ నిర్వహించే కోచింగ్ ఉపాధ్యాయులు సద్వినియోగపరచుకోవాలని ఆయన కోరారు.యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా,జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్,పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును కారణంగా చూపి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణతను తప్పనిసరి చేయడం సహేతుకం కాదన్నారు.బోధనలో అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులను ఇప్పుడు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలనడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు.ఉపాధ్యాయులలో నెలకొని ఉన్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం,కేంద్ర ప్రభుత్వంతో చర్చించి విద్యాహక్కు చట్టం 23 (1) కి సవరణ చేపట్టి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపశమనం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఆలోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు స్పెషల్ టెట్ నిర్వహించాలని కోరారు.ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష పై దృష్టి కేంద్రీకరించి,సన్నద్ధతకు సమయం వెచ్చిస్తే పాఠశాలల్లో విద్య బోధన కుంటుపడుతుందని వారు పేర్కొన్నారు.యుటిఎఫ్ ఒకవైపు టెట్ పరీక్ష రద్దుకు పోరాటాలు చేస్తూనే మరోవైపు, ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత పొందేందుకు కృషి చేస్తుందని వారు తెలిపారు. టెట్ ఉత్తీర్ణతపై ఉపాధ్యాయులెవరూ ఆందోళనకు గురికావలసిన అవసరం లేదని,ఉపాధ్యాయులు టెట్ పాస్ అయ్యేందుకు అవసరమైన కృషిని యుటిఎఫ్ చేస్తుందని వారు పేర్కొన్నారు.టెట్ పరీక్ష సులభంగా పాస్ అయ్యేందుకు యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నామ మాత్రపు ఖరీదుతో పుస్తకాలు రూపొందించి అందుబాటులోకి తెస్తున్నామన్నారు.రాష్ట్రంలో పేరెన్నికగన్న నిపుణులైన ఫ్యాకల్టీతో కోచింగ్ నిర్వహిస్తున్నామన్నారు.అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టెట్ బోధకులు కోవెల ప్రసాద్ రెడ్డి,బి.మస్తాన్ వలి యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎన్.నాగార్జున రెడ్డి,సహాధ్యక్షులు వై.రవికుమార్,డి.సుజాత రాణి,ట్రెజరర్ కె.నరసింహారావు జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ,ఎస్.ఎజాస్ అహ్మద్,ఎ.డి.దేవదత్తం,ఎన్.కంబగిరి,సి.సుదర్శన్ జె.వి.సుబ్బారెడ్డి,ఎ.వీరనారాయణ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు బి.ప్రసన్నలక్ష్మి,ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.




