టెట్ పై భయాందోళనలు వీడండి -యుటిఎఫ్ టెట్ కోచింగ్ ప్రారంభోత్సవంలో డీఈవో షేక్ షంషుద్దీన్

కడప జూన్ 26 ప్రజావాణి యుటిఎఫ్ భవన్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్సీటిఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని,దీనిపై కొందరు ఉపాధ్యాయులలో ఆందోళన నెలకొని ఉందని ఆయన పేర్కొన్నారు.టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయులకు ఆందోళన అవసరమేలేదని, బోధనలో అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత...