📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

వృద్ధాశ్రమంలో ఘనంగా కర్నాటి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు

* దేవినేని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
* వృద్ధులకు అన్నదానం,స్వీట్ల పంపిణీ

పోరుమామిళ్ల, జూన్ 26: వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల మండల బాలమ్మ సత్రం లో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం  సేవా దృక్పథంతో కూడిన ఒక అద్భుతమైన వేడుక జరిగింది.రాజకీయ నాయకుడు కర్నాటి వెంకటరెడ్డి 48వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని, స్థానిక బాలమ్మ సత్రం వద్ద ఉన్న వృద్ధుల మధ్య పుట్టినరోజు సంబరాలను అత్యంత ఘనంగా,అర్థవంతంగా నిర్వహించారు.సమాజంలో నిరాదరణకు గురవుతున్న వృద్ధులకు అండగా నిలవాలనే సత్సంకల్పంతో,ఎలాంటి ఆడంబరాలకు పోకుండా ఈ సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆశ్రమంలోని వృద్ధుల ఆశీస్సుల నడుమ కర్నాటి వెంకటరెడ్డి జన్మదిన కేక్ కట్ చేశారు. అనంతరం అక్కడి వృద్ధులందరికీ కడుపు నిండా భోజనాలు, స్వీట్లను స్వహస్తాలతో పంపిణీ చేశారు.తమ పుట్టినరోజున ఇలాంటి మానవీయ కార్యక్రమాన్ని చేపట్టడం పట్ల స్థానికులు,వృద్ధులు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ,దీవెనలు అందజేశారు.ఈ సేవా కార్యక్రమం దేవినేని సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో,వారి పర్యవేక్షణలో విజయవంతంగా జరిగింది.ఈ సందర్భంగా దేవినేని సుబ్బారెడ్డి మాట్లాడుతూ.పుట్టినరోజు వేడుకలను వృద్ధుల మధ్య జరుపుకుంటూ సమాజ సేవకు ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బిజెపి నాయకులు మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు, కార్యకర్తలు సుధాకర్, పసుపులేటి సాయి తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. వృద్ధుల మొఖాల్లో చిరునవ్వులు పూయించిన ఈ కార్యక్రమం మండలంలో అందరి ప్రశంసలను అందుకుంటోంది

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular