📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyసీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి విశాల్ రెడ్డి

సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి విశాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

పది లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులు
*సర్పంచ్ శశిరేఖ యాదయ్య తో కలిసి పనులు ప్రారంభించిన మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి*
షాద్ నగర్ ప్రజావాణి  జూన్ 25:
  నియోజకవర్గం లోని
కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు కేశంపేట మాజీ జడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి తెలిపారు. గురువారం గ్రామ సర్పంచ్ శశిరేఖ యాదయ్య తో కలిసి పనులు ప్రారంభించినట్లు వివరించారు. గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎంతగానో సహకారం అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందని వివరించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రఘు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుండె రాణి, అబ్బి సుందరయ్య, మాజీ సర్పంచ్ శివయ్య, వార్డు సభ్యులు బాలకృష్ణ, రవి, సురేష్, నందు, రామకృష్ణ, శ్రీను. మరియు తాండ్ర శ్రవణ్ రెడ్డి, కృష్ణారెడ్డి, శంకర్, సత్యం, యాదయ్య, రఘు, బాలరాజ్, నర్సింలు, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.