ఎండపల్లి మండలం గొడిశలపేట గ్రామంలో బుధవారం కుక్కల దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి గురువారం బాధితులను కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గెల్లు చంద్రశేఖర్ యాదవ్, సర్పంచ్ కందికట్ల అమృత రాజేశం, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
కుక్కల దాడి బాధితులను పరామర్శించిన మద్దుల గోపాల్ రెడ్డి
0
8
Previous article
Next article
RELATED ARTICLES



