•నేడే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోగలరు: మాణిక్ యాదవ్
*త్వరిగతిన న్యాయ పరిష్కారాలకు అరుదైన అవకాశం
పటాన్‌చెరు, జూన్ 19(ప్రజావాణి): ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించేందుకు నేడు దేశవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు హైకోర్టు అడ్వకేట్ ఐలాపూర్ మాణిక్ యాదవ్ తెలిపారు.
లోక్ అదాలత్‌లో బ్యాంకు రుణాల వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు (ఎన్‌ఐ యాక్ట్ సెక్షన్-138), మోటార్ ప్రమాద క్లెయిమ్ కేసులు, కుటుంబ వివాదాలు, భరణం కేసులు, కార్మిక వివాదాలు, విద్యుత్ మరియు నీటి బిల్లుల వివాదాలు, భూ సరిహద్దు, చిన్న స్థాయి ఆస్తి వివాదాలు, రాజీకి అవకాశం ఉన్న సివిల్ కేసులను పరిష్కరించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా తక్కువ సమయంలో కేసుల పరిష్కారం సాధ్యమవుతుందని, కోర్టు ఖర్చులు మరియు న్యాయ వ్యయాలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన రాజీ పరిష్కారం లభిస్తుందన్నారు. సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు పెండింగ్ కేసుల భారం తగ్గి సామరస్యపూర్వకంగా వివాదాలు ముగిసే అవకాశం ఉంటుందని వివరించారు.
“రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొంటూ, లోక్ అదాలత్‌కు అనుకూలమైన కేసులు ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐలాపూర్ మాణిక్ యాదవ్ విజ్ఞప్తి చేశారు.
జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోగలరు: మాణిక్ యాదవ్
RELATED ARTICLES

