📄 ePaper
Friday, August 7, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తోటపల్లిలో వృద్ధుడి ఉరి వేసుకొని ఆత్మహత్య

తోటపల్లిలో వృద్ధుడి ఉరి వేసుకొని ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి,జూన్ 19 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొంపెల్లి చంద్రయ్య (65) తన ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందాడు.మృతుడి కుమార్తె సొల్లు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చంద్రయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒంటరిగా నివసిస్తున్నాడు. కుటుంబ సభ్యులు వివిధ కారణాల వల్ల దూరంగా ఉండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.జూన్ 18 ఉదయం ఇంటి పక్కన నివసించే వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని తలుపులు తెరిచి చూడగా చంద్రయ్య ఉరి వేసుకుని కనిపించాడు. ఈ ఘటనపై తమకు ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ అంజయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular