బెజ్జంకి, జూన్ 18(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని దేవక్కపల్లి స్టేజ్ వద్ద నిర్వహిస్తున్న కీ.శే. శ్రీ మెండె కొమురయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి గురువారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా యువతలో క్రమశిక్షణ, ఐక్యత, పోటీతత్వం పెంపొందుతాయని అన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఒంటెల సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రావుల రామకృష్ణారెడ్డి, నేరెళ్ల రాజయ్య, రావుల రాజిరెడ్డి, జంగిడి సంజీవరెడ్డి, రావుల గోవర్ధన్ రెడ్డి, పడాల అశోక్, మెండె సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




