బెజ్జంకి, జూన్ 17(ప్రజావాణి)
:తన స్వంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తన కూతురుని చేర్పించి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు ప్రభుత్వ ఉద్యోగి వరికోలు శ్రీనివాస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిదిలోని వీరపూర్ గ్రామానికి చెందిన వరికోలు శ్రీనివాస్ చిగురుమామిడి మండలంలో జి.పి.ఓ గా విదులు నిర్వర్తిస్తూ తన గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను నిలిపేందుకు తన కూతురుని గురువారం చేర్పంచి పలువురికి ఆదర్శంగా నిలిచారు.ఈ సంధర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయులు భార్గవ్,ఉపాద్యాయులు శేఖర్,సర్పంచ్ చిలుముల సతీష్,ఉప సర్పంచ్ అన్నాడీ లత,అంగన్వాడీ వర్కర్ రాచకొండ విజయశ్రీ వార్డు సభ్యులు చిలముల రజిత,ఉప్పునీటి రాకేష్ లు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.




