📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రైమరీ హెల్త్ సెంటర్ బిగ్ బాస్,,

ప్రైమరీ హెల్త్ సెంటర్ బిగ్ బాస్,,

📰 Generate e-Paper Clip

బదిలీల రూల్స్ ప్రభుత్వానికే. ఈ‘వెంకటేశ్వర్లు’వుకు కాదా?20 ఏళ్లుగా ఒకే చోట ప్రభుత్వ ఉద్యోగం , 

మరెవరో అనుకుంటున్నారాపోరుమామిళ్లలోనే తిష్టవేసిన వైద్య విద్యాధికారి,! సాధు వెంకటేశ్వర్లు అరాచకాలపై ప్రత్యేక కథనం,

పోరుమామిళ్ల (ప్రజావాణి జూన్ 16) కుర్చీ కదలదు.కొలువు మారదు.ఆసుపత్రి ఏమైనా సొంత జాగీరా? ఈ పోరుమామిళ్ల. ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నుంచి ఐదేళ్లకోసారి బదిలీ కావడం చట్టం.కానీ వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి (PHC) లో మాత్రం ప్రభుత్వ చట్టాలు చుట్టాలుగా మారిపోయాయి. ఇక్కడి వైద్య అధికారి సాధు వెంకటేశ్వర్లు గత 20 సంవత్సరాలుగా ఏకంగా ఒకే చోట, ఒకే కుర్చీలో పాతుకుపోయి రికార్డు సృష్టిస్తున్నారు. రెండు దశాబ్దాలుగా ఈయనకు బదిలీలు లేవు.మార్పులు లేవు. ఏ ప్రభుత్వాలు మారినా,ఏ పొలిటికల్ లీడర్లు వచ్చినా ఈ ‘సాధు’ సామ్రాజ్యం మాత్రం చెక్కుచెదరకపోవడం వెనుక పెద్ద ఎత్తున పైస్థాయి అధికారుల రక్షణ ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.నిబంధనలు గాల్లోకి.అంతా ‘సాధు’ ఇష్టం!రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రూల్స్ ప్రకారం ఒకే చోట సుదీర్ఘ కాలం పనిచేసే అధికారులను తక్షణమే బదిలీ చేయాలి.ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించిన విభాగాలలో పారదర్శకత కోసం ఈ బదిలీలు తప్పనిసరి.కానీ పోరుమామిళ్ల వైద్య విద్య అధికారివిషయంలో ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు.నిబంధనల ప్రకారం మూడేళ్లు నిండిన వారందరినీ బదిలీ చేస్తున్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) అధికారులు.ఇరవై ఏళ్లుగా ఒకే చోట ఉన్న ఈయన ఫైలును మాత్రం ఎందుకు నొక్కేస్తున్నారనేది మిస్టరీగా మారింది.పడకేసిన వైద్యం.ప్రైవేట్ దందాకు రెడ్ కార్పెట్!ఒకే అధికారి ఇరవై ఏళ్ల పాటు సుదీర్ఘ కాలం కొనసాగడం వల్ల ఆసుపత్రి యాజమాన్యం పూర్తిగా గాడి తప్పిందని ‘ఇన్సైడ్’విచారణలో తేలింది.పేదలకు నరకం: ప్రభుత్వ ఆసుపత్రికి ఇతనే బాస్ బిగ్ , బిగ్ బాసు వచ్చే నిరుపేద రోగులకు సరైన వైద్యం అందడం లేదని, కనీస సౌకర్యాలు కల్పించడంలో సాధు వెంకటేశ్వర్లు ఘోరంగా విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కమీషన్ల దందా: సదరు వైద్య అధికారి స్థానిక ప్రైవేట్ క్లినిక్‌లు,ల్యాబ్‌లు,మెడికల్ షాపులతో కుమ్మక్కయ్యారని,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ వైపు మళ్లించి కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.సొంత సామ్రాజ్యం: ఒకే మండలం ఆయన సొంత గ్రామము పోరుమామిళ్ల ,,ఆయన ఇంటికి 50 మీటర్ల దూరంలో హాస్పిటల్. ఇరవై ఏళ్లుగా ఒకే చోట ఉండడంతో ఆసుపత్రిని తన సొంత ఆస్తిలా భావిస్తూ,తనకు ఎదురు చెప్పిన కింది స్థాయి సిబ్బందిని మానసిక వేధింపులకు గురిచేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.ఉన్నతాధికారులు, కలెక్టర్ నిద్రపోతున్నారా?ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) ఉన్నతాధికారులు గానీ,జిల్లా కలెక్టర్ గానీ ఈ సుదీర్ఘ కాలం నాటి వ్యవహారంపై ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి సారించి,ఇరవై ఏళ్లుగా పోరుమామిళ్లలోనే తిష్టవేసిన సదరు వైద్య అధికారి సాధు వెంకటేశ్వర్లుపై తక్షణమే విచారణ జరిపి,బదిలీ వేటు వేయాలని స్థానిక ప్రజలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular