📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన సర్పంచ్

ప్రజావాణి, బీర్కూర్:

బీర్కూరు మండలం చిన్‌చెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మంగళవారం పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, మెరుగైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తకాల పంపిణీ సందర్భంగా విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular