దేశం కోసం ప్రాణాలు అర్పించిన సూర్యపేట ముద్దుబిడ్డ, అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు ఆరవ వర్ధంతి వేడుకలు ఎండపల్లి మండలం అంబారిపేట హైవే కూడలి వద్ద ఘనంగా జరిగాయి. సముద్రాల రమేష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు దుర్గం శ్రీకాంత్, ఎలివేటి మల్లేష్‌లతో పాటు సంతోష్, విజయ్, శంకర్, కొండయ్య, సతీష్ తదితరులు పాల్గొని ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.

