prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 9:57 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

అంబారిపేట లో కల్నల్ సంతోష్ బాబుకు ఘన నివాళి

దేశం కోసం ప్రాణాలు అర్పించిన సూర్యపేట ముద్దుబిడ్డ, అమరవీరుడు కల్నల్ సంతోష్ బాబు ఆరవ వర్ధంతి వేడుకలు ఎండపల్లి మండలం అంబారిపేట హైవే కూడలి వద్ద ఘనంగా జరిగాయి. సముద్రాల రమేష్ గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచులు దుర్గం శ్రీకాంత్, ఎలివేటి మల్లేష్‌లతో పాటు సంతోష్, విజయ్, శంకర్, కొండయ్య, సతీష్ తదితరులు పాల్గొని ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.