గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జి ప్రారంభం – గ్రామ ప్రజల రాకపోకల కష్టాలకు శాశ్వత పరిష్కారం
షాద్‌నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ రూ.1.25 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో నిర్మించిన గంగన్నగూడ హై లెవెల్ బ్రిడ్జిని ఘనంగా ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభోత్సవంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, వర్షాకాలంలో గంగన్నగూడ గ్రామ ప్రజలు రాకపోకల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణంతో ఆ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందని తెలిపారు. గంగన్నగూడ నుంచి అనేక గ్రామాలకు రాకపోకలు సాగుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలను గుర్తించి, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఈ పనిని పూర్తి చేయడం సంతోషకరమన్నారు.
ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, నియోజకవర్గంలో ఎక్కడ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తున్నామని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాల అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి, సయ్యద్ సాదిక్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కేకే కృష్ణ, చెరుకుపల్లి సర్పంచ్ యాదయ్య, గంగన్నగూడ సర్పంచ్ విక్రమ్ రెడ్డి, బైరంపల్లి సర్పంచ్ పెద్దింటి జంగమ్మ, ఉపసర్పంచ్ కుంటోళ్ల నరేష్, ఎంపీటీసీ మల్లేష్, ముట్పూర్ సర్పంచ్ కనకమామిడి అంజయ్య, టేకులపల్లి సర్పంచ్ పత్తి శ్రీశైలం, పులుసుమామిడి సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, శ్రీరంగాపూర్ సర్పంచ్ రమేష్, చిన్న ఎల్కిచెర్ల సర్పంచ్ రాజకుమార్, ఎస్సీఎస్సెల్ అధ్యక్షుడు నరేందర్, బోరిగే యాదయ్య, మాజీ సర్పంచ్ కావలి యాదయ్య, బండమీది పెంటయ్య, రవికుమార్, గోపాల్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనలో ఈ హై లెవెల్ బ్రిడ్జి కీలక మైలురాయిగా నిలవనుంది…………. *జెర్నలిస్ట్ గిరిబాబు*




