📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణJagtialమోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పోస్టుల భర్తీల ఆహ్వానం

మోడల్ స్కూల్‌లో గంటల ప్రాతిపదికన ఉపాధ్యాయుల పోస్టుల భర్తీల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్, జూన్ 14 (ప్రజావాణి):

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను గంటల ప్రాతిపదికన (Hourly Basis) బోధించుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ (FAC) కె సందీప్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు.

ఖాలీగా ఉన్న పోస్టుల వివరాలు

టి.జి.టి (TGT) ఇంగ్లీష్: 01

పి.జి.టి (PGT) ఇంగ్లీష్: 02

పి.జి.టి (PGT) బోటనీ: 01

టి.జి.టి (TGT) మ్యాథ్స్: 01

పి.జి.టి (PGT) మ్యాథ్స్: 01

టి.జి.టి (TGT) సైన్స్: 01

విద్యా అర్హతలు: పి.జి.టి పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ (పీజీ) తో పాటు బి.ఎడ్ (B.Ed) ఉత్తీర్ణులై ఉండాలి.

టి.జి.టి పోస్టులకు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బి.ఎడ్, టెట్ (TET) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 16, 2026 సాయంత్రం 4 గంటల లోపు కుమ్మరిపల్లిలోని మోడల్ స్కూల్‌లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జూన్ 17 న డెమో నిర్వహించి, దాని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపడతామని ప్రిన్సిపాల్ పత్రికా ముఖంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular