📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetవిద్యానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని శిథిలావస్థకు చేరిందని ఐదు నెలల క్రితం...

విద్యానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని శిథిలావస్థకు చేరిందని ఐదు నెలల క్రితం అధికారులు కూల్చివేశారు. స్కూల్ కావాలని గత మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్న యువత

📰 Generate e-Paper Clip

సిద్దిపేట మర్కుక్, జూన్ 11 ప్రజావాణి

మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో గల విద్యానగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని శిథిలావస్థకు చేరిందని ఐదు నెలల క్రితం అధికారులు కూల్చివేశారు. అదే స్థలంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు.దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం చిన్నారులు తాత్కాలిక షెడ్డులో, చెట్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సందర్భంగా యువత మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఉన్న స్కూల్ ని అధికారులు కూల్చివేశారు. విద్యానగర్ కాలనీలో ఉన్న స్కూల్ మళ్లీ తిరిగి కట్టాలని గత మూడు సంవత్సరాల నుంచి  యువత పోరాడుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular