జగిత్యాల ఏబీ కన్వెన్షన్ హాల్‌లో ఉప సర్పంచుల ఫోరం జిల్లా స్థాయి సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాజారాంపల్లి ఉప సర్పంచ్ మేరుగు జంపన్నను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉప సర్పంచులకు రూ. 5 వేల గౌరవ వేతనం అందించాలని, ప్రభుత్వ కార్యక్రమాలు, శిలాఫలకాలపై తమకు సమాన ప్రాధాన్యత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా మేరుగు జానీ నియామకం
0
12
- Advertisment -



