📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetమార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ జిల్లా కలెక్టర్, హైమవతి,చేతుల మీదగా  ప్రారంభం..

మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ జిల్లా కలెక్టర్, హైమవతి,చేతుల మీదగా  ప్రారంభం..

📰 Generate e-Paper Clip

మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ జిల్లా కలెక్టర్, హైమవతి,చేతుల మీదగా  ప్రారంభం..

సిద్దిపేట్ మర్కుక్, జూన్ 8, ప్రజావాణి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం మార్కుక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ . హైమవతి, ప్రారంభించారు,ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు నిర్వాహకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ డా. హైమావతి,విద్యార్థుల విద్యా ప్రగతి, అర్హతలు అభ్యాస ప్రమాణాలను మరిం పారదర్శకంగా,సమర్థవంతంగా పర్యవేక్షించే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. విద్యా రంగంలో నాణ్యత పెంపుదలకు ఈ చర్య దోహదపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా, తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో రేపటి నుంచి ఉచిత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. నర్సరీ నుంచి ఎనిమిదో తరగతి వరకు అన్ని తరగతులకు అడ్మిషన్లు అందుబాటులో ఉండనున్నట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.తల్లిదండ్రులు తమ పిల్లల నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ అడ్మిషన్ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు పాఠశాల వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular