📄 ePaper
Sunday, June 7, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగుగ్గిళ్లలో కరీంనగర్ డైరీ నూతన పాలకవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా- కేడిక మధుసూదన్ రెడ్డి

గుగ్గిళ్లలో కరీంనగర్ డైరీ నూతన పాలకవర్గం ఎన్నిక అధ్యక్షుడిగా- కేడిక మధుసూదన్ రెడ్డి

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, జూన్ 7(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో కరీంనగర్  పాల డైరీ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో కేడిక మధుసూదన్ రెడ్డి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.సైట్ సూపర్ వైజర్ ధన్ రాజ్, డైరీ డైరెక్టర్లు,పాడి రైతుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో నూతన పాలకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ పాడి రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ ధన్‌రాజ్, డైరెక్టర్లు చాడ గోవర్ధన్ రెడ్డి, విస్వోజు సత్తయ్య, గూడ సంజీవరెడ్డి, తడిసిన రాజిరెడ్డి, కల్లూరి రాజయ్య,దూశెట్టి లింగారెడ్డి, దూశెట్టి నారాయణ రెడ్డి,కొంకటి రాజయ్య,చిట్టీ గంగయ్య, సెక్రటరీ మహేందర్ రెడ్డి పాడి రైతులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular