శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,జూన్ 5 ప్రజావాణి సర్వేపల్లి నియోజకవర్గం,సర్వేపల్లి గ్రామపంచాయతీ నుండి రేయంబవళ్ళు,వందలాది ట్రిప్పర్లతో అక్రమంగా గ్రావెల్ తవ్వి,తరలిస్తున్న సోమిరెడ్డి ముఠా!సర్వేపల్లి గ్రామపంచాయతీలో తవ్విన గ్రావెల్ ను, ట్రిప్పర్ కు 15 వేల నుండి 20వేల రూపాయల చొప్పున ముడుపులు తీసుకుని చింతా రెడ్డిపాలెం దగ్గర ఉన్న ప్రైవేట్ లేఔట్లకు అక్రమ గ్రావెల్ అమ్ముకుంటున్న సోమిరెడ్డి అవినీతి,అక్రమాలను ఆధారాలతో సహా చూపిస్తున్నా ఏమాత్రం పట్టించుకోని జిల్లా అధికార యంత్రాంగం రెవెన్యూ అధికారులు,పోలీసు అధికారులు, సోమిరెడ్డి బెదిరింపులకు,ప్రలోభాలకు లొంగి అక్రమ గ్రావెల్ మైనింగ్ వైపు కన్నెత్తి చూడడం లేదు పతివ్రత లాగా మాట్లాడుతున్న సోమిరెడ్డి మాటలు విని,సర్వేపల్లి ప్రజలు పతివ్రత అంటే సోమిరెడ్డి లాగా ఉండాలంటూ హేళన చేస్తున్నారు సోమిరెడ్డి మాత్రం నవ్విపోదురు గాక,నాకేంటి సిగ్గు అంటూ,నోట్ల కట్టలు లెక్కపెట్టుకుని దాచుకుంటున్నాడు సోమిరెడ్డి హయాంలో సర్వేపల్లి లో గ్రామాలు గుల్లయిపోతున్నాయి సర్వేపల్లి లో అనేక సందర్భాలలో తాటి చెట్టు లోతు గుంతలలో పసిబిడ్డలు,పశువులు,పడి ప్రాణాలు కోల్పోతున్న,సోమిరెడ్డి అక్రమ సంపాదనే ధ్యేయంగా పనిచేయడం తప్ప, కనికరం కలగడం లేదు జిల్లా కలెక్టర్,ఎస్పీ, జోక్యం చేసుకొని తక్షణమే సర్వేపల్లి గ్రామపంచాయతీలో శ్రీకాంత్ కాలనీ,నాగం బొట్ల వారి కండ్రిగ,తదితర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలను ఆపివేయాలని,బాధ్యులైన మైనింగ్,రెవెన్యూ అధికారులపై, తక్షణమే చర్యలు చేపట్టాలని సర్వేపల్లి ప్రజలు వేడుకుంటున్నారు
విచ్చలవిడిగా సోమిరెడ్డి గ్రావెల్ దోపిడీ “
RELATED ARTICLES




