📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ కార్యాలయం లో జెండా ఆవిష్కరణ చేసిన - మున్సిపల్...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ కార్యాలయం లో జెండా ఆవిష్కరణ చేసిన – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ కార్యాలయం లో జెండా ఆవిష్కరణ చేసిన – మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*

*పలు కార్యాలయాలలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జాతీయ పతాకం ఆవిష్కరించి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడి ప్రజలందరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం, మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, సామ సుజాతయాదవ రెడ్డి, జెల్ల ధనమ్మ శ్రీనివాస్, కోడి సుష్మ వెంకన్న, కటకం రమేష్, కో-ఆప్షన్ సభ్యులు కల్లెట్ల చంద్రకళ మారయ్య, మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ ఖలీల్, షేక్ సలీమా షరీఫ్, వార్డ్ ఆఫీసర్లు జి. శ్రీరాములు, బి. సాయిరాం, ఏ. జగన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ యం . అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు, ఆర్ పి లు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వి. శ్రీదేవి, ఎమ్మార్వో కార్యాలయం లో ఎమ్మార్వో రమాకాంత్ శర్మ, ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపిడిఓ యాదగిరి, పలు కార్యాలయాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు కార్యాలయాల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.