📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును కాపాడుకోండి - గంజాయి నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసుల ప్రత్యేక...

మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును కాపాడుకోండి – గంజాయి నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ. – జిల్లా వ్యాప్తంగా “మెగా గంజాయి టెస్టింగ్” కార్యక్రమాల నిర్వహణ

📰 Generate e-Paper Clip

తిరుపతి జూన్ 02 ప్రజావాణి  జిల్లా పోలీస్ శాఖ.గంజాయి వినియోగదారులను గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా మార్పుకు చర్యలు.యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్న పోలీసులు.డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా”లక్ష్యంతో నిరంతర చర్యలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్.ఆదేశాల మేరకు,తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు,ఐపీఎస్.పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది.యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం,సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని ప్రతి సబ్ డివిజన్‌లో సంబంధిత డీఎస్పీల ఆధ్వర్యంలో “మెగా గంజాయి టెస్టింగ్” కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.అనుమానిత ప్రాంతాలు,పరిశ్రమలు,కార్మికుల సమూహాలు మరియు ఇతర గుర్తించిన ప్రదేశాలలో గంజాయి పరీక్షలు నిర్వహిస్తూ,మత్తు పదార్థాల వినియోగాన్ని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.గంజాయి పరీక్షల్లో పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తులకు కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా,వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, కుటుంబ ఆర్థిక మరియు సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ వారిని సన్మార్గంలోకి తీసుకురావడానికి పోలీసులు కృషి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి సబ్ డివిజన్ పరిధిలో,డీఎస్పీ పర్యవేక్షణలో,తొట్టంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని కజారియా ఫ్యాక్టరీ మరియు వి-ఫార్మ్ పరిశ్రమల కార్మికులకు మెగా గంజాయి టెస్టింగ్ కార్యక్రమం నిర్వహించబడింది.ఎస్‌ఐలు,పోలీసు సిబ్బంది సమక్షంలో కార్మికులకు పరీక్షలు నిర్వహించారు.మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రజలు,యువత విద్యాసంస్థలు,పరిశ్రమల యాజమాన్యాలు మరియు తల్లిదండ్రులు పోలీస్ శాఖకు సహకరించాలని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు,ఐపీఎస్.విజ్ఞప్తి చేశారు.మత్తుకు దూరంగా ఉండండి  భవిష్యత్తును కాపాడుకోండి”అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబ వ్యవస్థను సమాజ శాంతి భద్రతలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య,ఉపాధి మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించాలి.గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉంది. మత్తు పదార్థాల అక్రమ రవాణా విక్రయాలు లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే టోల్ ప్రీ నెంబర్లు 1972 (ఈగల్) లేదా 112 పోలీసులకు తెలియజేసి ప్రజలు సహకరించాలి. ప్రజల భాగస్వామ్యంతోనే ‘డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా’ లక్ష్యాన్ని విజయవంతంగా సాధించగలమని తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్.పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.