మత్తుకు దూరంగా ఉండండి భవిష్యత్తును కాపాడుకోండి – గంజాయి నిర్మూలనకు తిరుపతి జిల్లా పోలీసుల ప్రత్యేక కార్యాచరణ. – జిల్లా వ్యాప్తంగా “మెగా గంజాయి టెస్టింగ్” కార్యక్రమాల నిర్వహణ
తిరుపతి జూన్ 02 ప్రజావాణి జిల్లా పోలీస్ శాఖ.గంజాయి వినియోగదారులను గుర్తించి కౌన్సిలింగ్ ద్వారా మార్పుకు చర్యలు.యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తున్న పోలీసులు.డ్రగ్స్ ఫ్రీ తిరుపతి జిల్లా"లక్ష్యంతో నిరంతర చర్యలు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపిఎస్.ఆదేశాల మేరకు,తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్.సుబ్బరాయుడు,ఐపీఎస్.పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ విస్తృత చర్యలు చేపడుతోంది.యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం,సమాజాన్ని మత్తు రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా...