
ఎన్టీఆర్ జిల్లా జూన్ 02 ప్రజావాణి నందిగామ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “బడి పిలుస్తుంది” కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు.మంగళవారం ఉదయం నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో డీఈవో చంద్రకళ, డివైఈవో గురునాథం, నందిగామ మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల బృందం ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ స్వయంగా ఒక కుటుంబానికి చెందిన విద్యార్థికి అడ్మిషన్ ఫారంను అందజేశారు. పిల్లల తల్లితో మాట్లాడి ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలను వివరించారు. మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, తల్లికి వందనం విద్యా కానుక, తల్లికి వందనం వంటి పథకాల గురించి తెలిపారు.డీఈవో చంద్రకళ మాట్లాడుతూ, “బడి ఈడు పిల్లలు ఒక్కరు కూడా బడికి దూరం కాకూడదు. ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నాం. తల్లిదండ్రులు ముందుకు వచ్చి పిల్లలను చేర్పించాలి” అని కోరారు.డివైఈవో గురునాథం మాట్లాడుతూ, జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయని, మొదటి రోజే 100% హాజరు ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

