నందిగామలో ఇంటింటికీ “‘బడి పిలుస్తుంది”‘అడ్మిషన్ ఫారంతో విద్యార్థుల ఇంటికి వెళ్లిన డీఈవో బృందం

ఎన్టీఆర్ జిల్లా జూన్ 02 ప్రజావాణి నందిగామ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన "బడి పిలుస్తుంది" కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారులు స్వయంగా రంగంలోకి దిగారు.మంగళవారం ఉదయం నందిగామ పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో డీఈవో చంద్రకళ, డివైఈవో గురునాథం, నందిగామ మండల విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల బృందం ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఈవో చంద్రకళ స్వయంగా ఒక కుటుంబానికి చెందిన విద్యార్థికి అడ్మిషన్ ఫారంను అందజేశారు. పిల్లల...