📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కూటమిపాలనంతా కుట్రలమయం - కాకాణి"

కూటమిపాలనంతా కుట్రలమయం – కాకాణి”

📰 Generate e-Paper Clip

పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.(మే30 ప్రజావాణి) తోటపల్లి గూడూరు మండలం.కామాక్షి నగర్, తోటపల్లి గ్రామాలలో పర్యటించిన మాజీ మంత్రి వర్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు”డా” కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పనులు మంజూరు కాక,శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు శిలాఫలకాలు వేసే అవకాశం రాక,పాత శిలాఫలకాలకు పసుపు రంగులు వేసుకుంటున్నారంటూ గ్రామస్తులు ఎద్దేవా జగనన్న హయాంలో జరిగిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు తప్ప,కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ఊసే లేదని కాకాణి ఎదుట వాపోయిన స్థానికులు ఇరిగేషన్ పేరిట దొంగ బిల్లులు చేసుకుని,దోచుకోవడం తప్ప,రైతులకు సాగునీరు అందించే ఉద్దేశం,ప్రజా ప్రతినిధులకు లేదంటూ కాకాణి ఎదుట వాపోయిన రైతులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా,మీరు మంత్రిగా,నరుకూరు నుండి మండల కేంద్రం తోటపల్లి గూడూరు వరకు సిమెంట్ రోడ్లు నిర్మించి,ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేర్చారంటూ ప్రశంసించిన స్థానికులు ఎన్నికల కమీషన్ నూతనంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కా ర్యక్రమం పట్ల బూత్ లెవెల్ ఏజెంట్లు,స్థానిక నాయకులు,బాధ్యతాయుతంగా వ్యవహరించి,అర్హులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు కోల్పోకుండా,అధికార తెలుగుదేశం పార్టీ అనర్హుల ఓట్లను నిలుపుకునే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన కాకాణి- కామాక్షి నగర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ సర్పంచ్,దాన స్వాతి,రమేష్,ఇంటికి వెళ్లడంతో పాటు,తోటపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నం రవిచంద్ర,ఇంటికి వెళ్లి కార్యకర్తలతో పలు విషయాలు చర్చించిన కాకాణి- తోట పల్లి గ్రామంలో ఇటీవల మరణించిన రాయపు నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకాణి- కూటమిపాలనలో కుట్రలు చేయడం తప్ప ప్రజల అభివృద్ధి సంక్షేమం గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు! గ్రామాలలో అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేక,కొత్తగా శిలాఫలకాలు వేసే అవకాశం లేకపోవడంతో,ఎప్పటివో పాత శిలాఫలకాలకు పసుపు రంగు పూసుకుని పులకించి పోతున్నారు- గ్రామాలలో సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, త్రాగునీటి వసతి,సాగునీటి అవసరాలు,అన్నింటిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే పూర్తి చేసాం- కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేకుండా,పాత పెన్షన్లను ప్రతినెల 1వ తేదీ వచ్చి పంపిణీ చేయడం తప్ప, మరొక కార్యక్రమం చేపట్టడం లేదు- ఇరిగేషన్ లో దొంగ బిల్లులు చేసుకుంటూ రైతులను అడ్డుపెట్టి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు- తోటపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దాదాపు 112 కుటుంబాలకు ఇళ్ల స్థలాలు అవసరపడితే, రైతుల వద్ద కొనుగోలు చేసి లేఅవుట్లు వేసి,పట్టాలు పంపిణీ చేశాం ప్రతి గ్రామంలో జగనన్న పేదల సొంత ఇంటి కల తీర్చేందుకు ఇళ్ళు మంజూరు చేస్తే,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక,ట్టుకుంటున్న ఇళ్లకు బిల్లులు నిలిపివేసి,పేదవాడి సొంత ఇంటి కల నెరవేరకుండా చేసింది-జగనన్న ముఖ్యమంత్రిగా గ్రామస్థాయిలో నిర్మించిన సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు,వైయస్సార్ హెల్త్ క్లినిక్ లు,అప్పటికి,ఇప్పటికి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా సేవలందిస్తున్నాయి గ్రామాలలో పర్యటిస్తుంటే,ప్రజలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి అమలైన సంక్షేమ కార్యక్రమాల గురించి,గొప్పగా మాట్లాడుకోవడం సంతోషాన్ని కలిగిస్తుంది జగనన్న అధికారం కోల్పోయినా,ప్రజల హృదయాల్లో మాత్రం సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు సర్వేపల్లి నియోజకవర్గంలో అడుగడుగునా అవినీతి తాండవిస్తుందే తప్ప,అభివృద్ధిని గురించి గానీ  ప్రజల సంక్షేమాన్ని గురించి గానీ పట్టించుకునే వారు లేరు గ్రామాలలో కక్షలు ప్రోత్సహిస్తూ,గ్రామస్తుల మధ్య చిచ్చుపెట్టి,కేసులు బనాయించడం తప్ప,ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన పోవడం లేదు రైతులు,విద్యార్థులు,యువకులు,మహిళలు,అన్ని వర్గాలకు చెందిన ప్రజలు,కనీస అవసరాలు తీరక తీవ్రంగా మధన పడుతున్నారు-పెట్రో,డీజిల్ ధరలతో పాటు,నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అధికారంలో ఉన్నా,లేకపోయినా ప్రజలకు పిలిస్తే పలుకుతూ,ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.