📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipet132/33 కేవి విద్యుత్ లైన్ పునరుద్ధరణలో విద్యుత్ అధికారుల కృషి విజయం " గ్రామ ప్రజలకు...

132/33 కేవి విద్యుత్ లైన్ పునరుద్ధరణలో విద్యుత్ అధికారుల కృషి విజయం ” గ్రామ ప్రజలకు నిరంతర విద్యుత్ సేవలందిస్తున్న లైన్ మెన్ మల్లయ్య”

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 29(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ గ్రామంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. వెనువెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు గ్రామ ప్రజల కోసం అంకితభావంతో పనిచేస్తున్న,లైన్ మెన్ మల్లయ్య, జూనియర్ లైన్ మెన్ నరేష్,సబ్ స్టేషన్ ఆపరేటర్ చంద్రారెడ్డి సేవలను గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు.“నేను నిద్రపోకున్నా పరవాలేదు కానీ నా గ్రామ ప్రజలకు విద్యుత్ సరఫరా నిరంతరం ఉండేలా చూస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు పడకుండా రాత్రింబవళ్లు శ్రమిస్తూ విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గురువారం రోజున రాత్రి సమయంలో శనిగరం సబ్స్టేషన్(132/33 కేవి),గుగ్గిళ్ల సబ్ స్టేషన్ కి వచ్చే 33/11 కేవి ఫీడర్ ప్రాబ్లం వల్ల విద్యుత్ కి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు రాత్రి సమయంలో గుగ్గిళ్ళ లైన్ నుండి శనిగరం సబ్స్టేషన్ వరకి సుమారు (2 గంటలు) తెల్లవారుజామున వరకి ఆ యొక్క అంతరాయం ఏర్పడిన దానికి మరమ్మత్తు చేసి విద్యుత్ ని పునరుద్ధరించారు.ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలందించడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు లైన్ మెన్ మల్లయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులకు  హెల్పింగ్ కి బాణాల రాజు, బాణాల తిరుమల్ సహకరించారని విద్యుత్ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.