బెజ్జంకి, మే 26(ప్రజావాణి )
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించారునిన్న కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన,నిల్వ ఉంచిన వరి,మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు తడిసిపోయాయని ఆయన తెలిపారు.కొనుగోలు ప్రక్రియ తీవ్ర ఆలస్యంగా సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,లింగాల శ్రీనివాస్,శ్రీనివాస్ గుప్తా, మాజీ జడ్పిటి సి కవిత, దిటి రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.

