“అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి” మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్
బెజ్జంకి, మే 26(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని కొనుగోలు కేంద్రాలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సందర్శించారునిన్న కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా కొనుగోలు కేంద్రాల్లో పోసిన,నిల్వ ఉంచిన వరి,మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలు తడిసిపోయాయని ఆయన తెలిపారు.కొనుగోలు ప్రక్రియ తీవ్ర ఆలస్యంగా సాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా...