వైఎస్ఆర్ కడప జిల్లా,(మే27 ప్రజావాణి) పోరుమామిళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పోరుమామిళ్ల మండల అధ్యక్షుడు అన్వర్,జవహర్ బాలమంచ్ జిల్లా అధ్యక్షుడు పుల్లూరు భాష. ఆధ్వర్యంలో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్.డి.విజయ జ్యోతి ముఖ్యఅతిథిగా పాల్గొని ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విజయ జ్యోతి మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర సిద్ధించడంలో కీలకమైన పాత్ర పోషించి,అనేక సంవత్సరాలు జైలు జీవితం గడిపి భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా తన సేవలను అందించి మనదేశాన్ని ప్రపంచ పటంలో ఒక దిక్సూచిగా నిలబెట్టిన ఘనమైన చరిత్ర కలిగిన గొప్ప మహనీయుడు నెహ్రు అని ఆమె కొనియాడారు.ఆయన సేవలు నేటికీ చిరస్మరణీయమని గొప్ప జాతీయవాదిని ఈ సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నారు.నివాళులు అర్పించిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ నేడు భారతదేశం మత విద్వేషాలతో విలవిలాడుతుందని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటికీ వారి పంతా దేశ అభివృద్ధి కాదని విద్వేషాలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయం చేయడమే వారికి పనిగా మారిందని, ఇలాంటి తరుణంలో భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీయే సరైన నాయకుడని ఆయనను ప్రధాని చేసుకునేందుకు ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు రావాలని ఈ సందర్భంగా యువతరానికి ప్రతి ఒక్కరికి రాజకీయంగా అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలుకుతుందని, వైయస్ షర్మిల రెడ్డి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశం ఉందని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిస్తూ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది ఇతర పార్టీలకు చెందిన నేతలను కార్యకర్తలు వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో అన్ని జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆమె గుర్తు చేశారు.
నేడు బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు ఎలక్షన్ల సమయంలో ఏదో ఒక అలజడి సృష్టించడం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రతిసారి ఏదో ఒక రూపంలో ధరలను పెంచడం జరుగుతుందని ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్,డీజిల్ ధరలు విపరీతంగా పెంచుతూ దాదాపు 8 రూపాయలు పెట్రోల్ పైన 7 రూపాయలు డీజిల్ పైన వారం వ్యవధిలో నాలుగు సార్లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.కేవలం ఎన్నికల కోసమే భారతీయ జనతా పార్టీ భారతదేశాన్ని పాలిస్తుంది తప్ప ప్రజల శ్రేయస్సు కోసం కాదని ఆమె మండిపడ్డారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ పెట్టబోతున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయ జ్యోతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక నాయకత్వాన్ని బలపరచాలని ఉద్దేశ్యంతో షర్మిలా రెడ్డి,ఆదేశానుసారం జిల్లాలో ప్రతి ఒక్క స్థానంలో ఎంపీటీసీలు జడ్పిటిసిలు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సర్పంచుల స్థానాలకు పోటీ ఉంటుందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.రాచమల్లు కేవలం సాక్షి పేపర్ చూస్తే సరిపోదు,గత మూడు రోజులుగా రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డి,పై వస్తున్నటువంటి ఆరోపణలకు జవాబిస్తూ ఎప్పుడో చనిపోయిన వ్యక్తులపైన నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే చూడటం ఎంతవరకు సమంజసం అని పులివెందులలో,కడప జిల్లాలో రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి,వారి హయాంలో అభివృద్ధిని కూడా ఒకసారి చూడాలని తెలుగుదేశం నాయకులంతా కూడా దానిపైన కూడా మాట్లాడాలని ఆమె చెబుతూ,వైఎస్ఆర్సిపి నాయకులు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి,మీరు కేవలం సాక్షి పేపర్ చూస్తే సరిపోదని “ఎక్స్” వేదిక ద్వారా నిన్న రాజారెడ్డి,రాజశేఖర్ రెడ్డి,పై వస్తున్నటువంటి ఆరోపణలకు వైఎస్ షర్మిల రెడ్డి,పూర్తిగా ఖండించారని వాటిని కూడా ఒకసారి గమనించాలని కుటుంబ సమస్యల పైన మీరు మాట్లాడం పక్కనపెట్టి ప్రొద్దుటూరు నియోజకవర్గ సమస్యలపై,రాష్ట్ర సమస్యలపై మాట్లాడితే బాగుంటుందని ఆమె హితవు పలికారు.ఈ విలేకరుల సమావేశంలో కాశినాయన మండల అధ్యక్షులు ఖాజావలి,యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ముజాహిద్, సోహెల్, స్వామి తదితరులు పాల్గొన్నారు
పోరుమామిళ్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నెహ్రూ వర్ధంతి
RELATED ARTICLES



