📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetగాలి వాన బీభత్సం ఇరిగిపడిన కరెంటు స్తంభాలు లేచిపోయిన  ఇంటిపై కప్పులు

గాలి వాన బీభత్సం ఇరిగిపడిన కరెంటు స్తంభాలు లేచిపోయిన  ఇంటిపై కప్పులు

📰 Generate e-Paper Clip

గాలి వాన బీభత్సం ఇరిగిపడిన కరెంటు స్తంభాలు లేచిపోయిన  ఇంటిపై కప్పులు

చింతలపాలెం మే 25 (ప్రజావాణి)



చింతలపాలెం మండలంలోని తమ్మారం గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం భారీ నష్టాన్ని మిగిల్చింది. బలమైన గాలులకు తోడు వర్షం కురవడంతో గ్రామంలో పలుచోట్ల ఇండ్ల రేకులు ఎగిరిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కాకునూరి రోశమ్మ ఇంటి రేకులు పూర్తిగా గాలికి కొట్టుకుపోగా, ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం అయింది  షేక్ జానమ్మ   ఇండ్ల రేకులు కూడా  ఎగిరిపోయాయి. అకాల వర్షం, బలమైన గాలుల ప్రభావంతో గ్రామంలోని పలుచోట్ల విద్యుత్ 11 కెవి స్తంభాలు దాదాపు పది స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు.నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించి ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.