📄 ePaper
Tuesday, July 28, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల్లో కులగణన ఆధారంగా రజకులకు కొన్ని స్థానాలను రిజర్వేషన్ చేయాలి

స్థానిక సంస్థల్లో కులగణన ఆధారంగా రజకులకు కొన్ని స్థానాలను రిజర్వేషన్ చేయాలి

📰 Generate e-Paper Clip

కడప (మే25 ప్రజావాణి) కలెక్టరేట్ లోని పాత పిజిఆర్ఎస్ హాల్ నందు బిసి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ రాజీవ్ రంజన్ మిశ్రా (ఐఏఎస్ ) కి రజకుల సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభా రిజర్వేషన్ 40% శాతానికి పైగా పెంచుతూ,ప్రత్యేకించి రజకులకులకు కొన్ని సీట్లు రిజర్వ్ చేయాలని ఆల్ ఇండియా ధోపి మహాసంగ్రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందపల్లి కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు చేలో రవీలు కోరారు దేశానికి స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు పైబడినా కులానికి మతానికి వర్గానికి వర్ణానికి అతీతంగా సేవాపరమైనటువంటి కులవృత్తిని కొనసాగిస్తున్నా రజకులకు స్థానిక సంస్థల్లో కొన్ని సీట్లు రిజర్వ్ చేసి ప్రాతినిధ్యం కల్పించాలని కృష్ణయ్య కోరడం జరిగింది రజకులకు వార్డు మెంబర్ లు గా,సర్పంచులుగా,మున్సిపల్ కౌన్సిలర్,ఎంపిటిసిగా, జడ్పిటిసిగా,జిల్లా పరిషత్ చైర్మన్ గా,కార్పొరేషన్ మేయర్ గా మున్సిపల్ చైర్మన్ లు గా అవకాశం కల్పించాలని రాజీవ్ రంజన్ మిశ్రా ను కోరారు రాష్ట్ర ప్రభుత్వం కులగణనను శాస్త్రీయంగా పూర్తి చేసి రజకుల వాస్తవ జనాభా లెక్కలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు, సంఖ్యకు అనుగుణంగా ఏఏ మండలాల్లో మున్సిపాలిటీలో వారికి సీట్లు కేటాయించాలో బిసి డెడికేషన్ కమిషన్ ద్వారా స్పష్టమైన మ్యాపింగ్ ఇవ్వాలని అన్నారు రజకులకు ప్రాధాన్యత నిచ్చే విధానాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధం చేయాలని ఆయన కోరారు వినతి పత్రం సమర్పించిన వారిలో రజక సంఘం జిల్లా నాయకులు చెన్నప్ప,పిచ్చయ్యలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular