EVENING EDITION
📄 ePaper
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapet*హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ

*హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోదాడ క్రికెట్ అకాడమీలో నిర్వహిస్తున్న సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంప్ –2026 లో భాగంగా క్రీడాకారులకు సుమారు రూ.1,50,000 విలువైన క్రీడా సామాగ్రిని కోదాడ క్రికెట్ అకాడమీ అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి సురేష్ అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ ప్రాంతంలో అపారమైన క్రికెట్ ప్రతిభ దాగి ఉందని, సరైన శిక్షణ, క్రమశిక్షణతో ఇక్కడి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటగలరని విశ్వాసం వ్యక్తం చేశారు.క్యాంప్ విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ అమిరుద్దీన్ కి ప్రత్యేకంగా అభినందించారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు ఇలాంటి అవకాశాలు కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.
ప్రపంచ క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ ఫిట్నెస్,డిసిప్లిన్ ప్రతి యువ క్రీడాకారుడికి ఆదర్శమని, క్రీడాకారులు కూడా అలాంటి క్రమశిక్షణ, అంకితభావం అలవర్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.గత విద్యా సంవత్సరంలో కోదాడ క్రికెట్ అకాడమీకి చెందిన సుమారు 44 మంది క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇందుకోసం అహర్నిశలు శ్రమిస్తున్న అకాడమీ కోచ్ సిద్ధిఖ్ ని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి సేవలు మరెంతో మంది యువ క్రీడాకారుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నాయని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రామాపురం గ్రామ సర్పంచ్ వేమూరి సతీష్ , డాక్టర్ నందకిషోర్, మెట్టు శంకర్, జబ్బర్, భట్టు కేవల్ పంత్ , బుల్లయ్య, రామలింగయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.