హౌసింగ్ శాఖ డైరెక్టర్ సవాయి రామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి .
బూర్గంపాడు మండలం,/ప్రజావాణి, ప్రతినిధి మే 23,.
బూర్గంపాడు మండలం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయానికి విచ్చేసినటువంటి హౌసింగ్ శాఖ డైరెక్టర్ సవాయ్ రామ్ గారిని మర్యాదపురం కలిసిన లక్ష్మిపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి గారు. బూర్గంపాడు మండలంలోనే రెండో మేజర్ గ్రామపంచాయతీ అయిన లక్ష్మీపురం గ్రామపంచాయతీకి అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని చెప్పి సర్పంచ్ గారు కోరారు. కట్టిస్తున్నటువంటి, నిర్మాణంలో ఉన్నటువంటి ఇండ్లకు బిల్లుల మంజూరు విషయంలో,ఎటువంటి తారతమ్యాలు లేకుండా చూడాలని చెప్పి ప్రాధేయ పడ్డారు. ప్రజా ప్రభుత్వం పాలనలో, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని చెప్పి కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుడు,గూడు అని చెప్పారు. కావున అధికారులందరూ నిబద్ధతతో సహకరించాలని చెప్పి కోరారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మండలం ఎంపీడీవో జములా రెడ్డి గారు హౌసింగ్ ఏఈ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు
హౌసింగ్ శాఖ డైరెక్టర్ సవాయి రామ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన బూర్గంపాడు మండలం లక్ష్మీపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బాదం వెంకటేశ్వర్ రెడ్డి
RELATED ARTICLES


