📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌

📰 Generate e-Paper Clip

విజయవాడ (మే 20 ప్రజావాణి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నగరాల కులస్తుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ కోచింగ్ సెంటర్‌ను ఈరోజు తొలి బ్యాచ్ సందర్భంగా పోతిన విజయలక్ష్మి మహేష్ సందర్శించారు.ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి వారు ప్రసంగించారు.విద్యార్థుల అటెండెన్స్‌ను పరిశీలించిన పోతిన విజయలక్ష్మి మహేష్, క్రమం తప్పకుండా కంప్యూటర్ క్లాసులకు హాజరవుతూ చదువుపై చూపుతున్న శ్రద్ధ, గౌరవం అభినందనీయమని తెలిపారు. రానున్న కాలంలో నగరాల కులానికి చెందిన సంఘాలు తమకు తోచిన విధంగా విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించే కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.ముఖ్యంగా ఈ క్లాసుల్లో అధిక సంఖ్యలో మహిళా విద్యార్థులు పాల్గొనడం గమనించిన వారు,వారి కాలేజీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు ఎటువంటి అవసరం వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం ద్వారా తమ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.అనంతరం పోతిన విజయలక్ష్మి మహేష్ చేతుల మీదుగా విద్యార్థులకు సర్టిఫికెట్స్ భద్రపరచుకునేందుకు జిప్ బ్యాగ్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీమతి విజయలక్ష్మి తో పాటు పైలా పవన్ కుమార్, అడ్డూరి తమ్మా రావు పాల్గొన్నారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాయన బెనర్జీ,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు గూడేల మణికంఠ, విజయవాడ సిటీ అధ్యక్షులు గూడేల యోగేష్,రాష్ట్ర విద్యా చేయూత కోశాధికారి రాయన అరుణ్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.