
పోరుమామిళ్ల (మే 20 ప్రజావాణి) తాసిల్దార్ కార్యాలయంలో విద్యార్థులు,సర్టిఫికెట్లకు కోసం రోజుల తరబడి అధికారులు అందుబాటులో ఉండడం లేదని విద్యార్థులు వాపోతున్నారని సిపిఐ బద్వేల్ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్,ఏరియా కార్యవర్గ సభ్యులు సఫా,పిరయ్య లు రెవెన్యూ అధికారుల పై ఆగ్రహం చెందారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఎంసెట్,ఈసెట్ ఐఐటి,త్రిబుల్ ఐటీ,నీట్,త్రిబుల్ ఈ,లాంటి ఉన్నత చదువులకు విద్యార్థులు వెళ్లాలంటే,బర్త్,క్యాస్ట్ ఆదాయం సర్టిఫికెట్,లా కోసం తాసిల్దార్ కార్యాలయంలో,జూనియర్ అసిస్టెంట్ సమయపాలన లేకపోవడం, ఒక్కరోజు కూడా సమయానికి ఆఫీసుకు రాకపోవడం,వలన విద్యార్థులు వారి భవిష్యత్తు అందాకారమయ్యే పరిస్థితి నెలకొంటుంది అదేవిధంగా బర్త్ సర్టిఫికెట్ కోసం,ఫ్యామిలీ మెంబర్,ఈ డబ్ల్యూ ఎస్ సర్టిఫికెట్ లాంటి సర్టిఫికెట్ల కోసం 200 లేక 500 రూపాయల వరకు డబ్బులు ఇస్తే గాని,వారి అప్లికేషన్ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. డబ్బులు తీసుకోవడంలో రెవెన్యూ అధికారుల చేతివాటంగా ఉన్నదని విద్యార్థులు,వారి తల్లిదండ్రులు వాపోతున్నారు.అలాగే క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ లో పేరు బదులు గా చుక్కలు రావడం వలన,విద్యార్థులు ఆర్డిఓ కార్యానికి వెళ్లి,వారాల తరబడి తిరిగిన విద్యార్థులు పని కావడం లేదని,రవిన్యూ అధికారుల చిన్నపాటి నిర్లక్ష్యానికి విద్యార్థులు బలి కావడం చాలా బాధాకరమన్నారు. తక్షణమే ఇలాంటి సమస్య ఇంకో విద్యార్థికి రాకుండా జిల్లా ఉన్నత అధికారులు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు లేనిపక్షంలో విద్యార్థులను కూడగట్టి తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపడుతామని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల సమితిగా అధికారులను హెచ్చరించారు



