📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు.

మోతె, మే 18/ ప్రజావాణి

కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం స్థానిక ఎమ్మెల్యే నల్లమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ని సోమవారం మోతే మండల కేంద్రంలో మర్యాదపూర్వకంగా కలిసినారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కోదాడ నియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి, ప్రధాన కార్యదర్శి బండారు నాగరాజు, ఉపాధ్యక్షుడు బాణాల అబ్రహము, కోశాధికారి షేక్ నూరుద్దీన్, గౌరవ సలహాదారులు బత్తిని కృష్ణమూర్తి మరియు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల కృషి అభినందనీయమన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టుల సంక్షేమానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గడ్డం అంజి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు, జర్నలిస్టు కోటాలో ఇందిరమ్మ ఇల్లు ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి అవసరమైన స్థలం మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.