*మన ప్రజావాణి సమగ్ర వార్త కథనాలకు స్పందన
*ఎట్టకేలకు పందిళ్లపల్లి సర్వసభ్య సమావేశానికి మత్స్య శాఖ ఏడి” రాక”..?
*మెజార్టీ ప్రకారం సభ్యుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిర్ణయం
*ఉమ్మడి జిల్లాలో మెరిసిన ప్రజావాణి వార్త కథనాలు… మత్స్యకారుల ప్రశంసలు
మన ప్రజావాణి సమగ్ర ప్రత్యేక కథనం..8
ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య పారిశ్రామిక సంఘంలో గత సంవత్సరం నుండి అనేక ఆరోపణలపై మత్స్య సహకార సంఘం అటుకుతోంది. నాడు 12 ఏళ్ల సుదీర్ఘ కలను సాకారం చేసేందుకు మత్స్యకారులు జిల్లా కలెక్టర్ మొదలు రాష్ట్రస్థాయి కమిషనర్ వరకు అనేక వినతి పత్రాలు విజ్ఞాపనలు అందించిన నేపథ్యంలో గత ఏడాది నూతనంగా 50 మందికి అది కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారికి సభ్యత్వాలు అందజేశారు. కాగా ప్రధానంగా మాజీ అధ్యక్షుడు నిధుల దుర్వినియోగంపై రికవరీ వ్యవహారంపై కలెక్టర్ ప్రజావాణి గ్రీవెన్స్ లో పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ అధ్యక్షుడు కార్యదర్శి మత్స్యకారులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఇది ఇలా ఉండగా మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి వీరభద్రం క్షేత్రస్థాయిలో మత్స్యకారుల మనోవేదన జరుగుతున్న అన్యాయం ప్రభుత్వ జీవోలు రికవరీ అంశాలు పెద్ద చెరువు కుంటల వ్యవహారంపై సమగ్ర కథనాలకు జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులు శివప్రసాద్ స్పందించారు. ఈ మేరకు ఎట్టకేలకు బుధవారం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ సర్వసభ్య సమావేశం నిర్వహించి రికవరీ ఉచిత చేప పిల్లలు పంపిణీ చేపల వేట తదితర అంశాలతో పాటు పందిళ్ళపల్లి పెద్ద చెరువు అనుబంధంగా కుంటల వ్యవహారంపై సర్వసభ్య సమావేశంలో రికార్డుల ప్రకారం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నదని తెలిసింది. సంఘం పరిధిలోని అనంతసాగర్ గ్రామానికి చెందిన కొందరు కుంటలతో పాటు పెద్ద చెరువులో వాటా ఉంటుందని ఇటీవల ప్రచారం స్వల్ప ఘర్షణ మాదిరి వాతావరణం నెలకొనడంతో పాటు మన ప్రజావాణి సంచలన సమగ్ర కథనాలకు దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా ఉచిత చేప పిల్లలు దళారీ వ్యవస్థ లేకుండా చెరువు మరియు కుంటలలోవదులుకొని జీవనోపాధి పెంపొందించేందుకు మత్స్యకారులు దాదాపు 90 మంది నాటి సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసి జిల్లా కలెక్టర్కు మత్స్య శాఖ సహాయ సంచాలకులకు అందించినట్లు మత్స్యకారులు అంటున్నారు. చేపల చెరువు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా వార్త కథనాలు అందించిన మన ప్రజావాణి తెలుగు దినపత్రిక యాజమాన్యానికి ఉమ్మడి జిల్లా మత్స్యకారులు స్థానిక మత్స్యకారులు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికైనా అందిన దరఖాస్తులు వినతి పత్రాలు రికార్డులను పరిశీలనలోకి తీసుకొని మత్స్యకారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ఆయా గ్రామాల ప్రజలు మత్స్యకారులు కోరుతున్నారు.


