📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కాశి నాయన దగ్గర ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద అన్న వితరణ ఆర్ట్ ఆఫ్ లివింగ్...

కాశి నాయన దగ్గర ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద అన్న వితరణ ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి..

📰 Generate e-Paper Clip

మార్కాపురం జిల్లా మే18 ప్రజావాణి గిద్దలూరు పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన ఆశ్రమం నందు ప్రతి సోమవారం ఆయుర్వేద భోజనం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమేనన్నారు ఉదయం కాశినాయనకు అభిషేకం చేసి పూల మాలలతో నూతన వస్త్రాలు అలంకరించి పూజా కార్యక్రమాలు పురోహితుల చేత నిర్వహించడం జరిగినది. వచ్చిన భక్తాదులకు బుసిరెడ్డి పుల్లారెడ్డి ధర్మపత్ని వెంకటమ్మ కుమారుడు బుసిరెడ్డి రామ్మోహన్ రెడ్డి ధర్మపత్ని రజిని లు మరియు యేరువ శ్రీనివాస్ రెడ్డిలు భోజనం ఏర్పాటు చేశారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్, బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు తెలిపారు. ప్రతి సోమవారం కాశినాయన దగ్గర ప్లాస్టిక్ రహిత ఆయుర్వేద భోజనం ఏర్పాటు కోసం దాతలు విరివిగా ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు కాశినాయన దగ్గర భోజనం ఏర్పాటు చేస్తే మన కుటుంబానికి ఆయురారోగ్యాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజల నానుడని తెలిపారు కాశినాయన భక్తులకు చక్కటి పసుపు చెక్క లవంగాలతో కూడుకున్న పులగము పచ్చడి పెరుగు పరమాన్నం రుచికరమైన భోజనం ప్రతి సోమవారం అందిస్తున్నామన్నారు. 15 నెలల నుండి దాతలు అందించే ఆర్థిక సాయం మరువలేనిదని వారి గొప్పతనానికి వెలకట్టలేనిదని అన్నదాతలను కొనియాడిన బి యస్ నారాయణరెడ్డి సంఘ సేవకులు భోజనానికి ఆర్థిక సాయం చేసిన కుటుంబీకులకు శ్రీ శ్రీ భగవాన్ కాశిరెడ్డి నాయన అన్న వితరణ సేవాసరం తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్రాంత సూపర్డెంట్ పాలుగుల్ల కాశిరెడ్డి విశ్రాంత లెక్చరర్ వడ్డీ వీరారెడ్డి విశ్రాంత ఆర్టిసి ఉద్యోగి వెంకటేశ్వర్లు గౌడ్ ఎదురు శ్రీనివాసరెడ్డి బాలరాజు ఏరు రమణారెడ్డి కాశినాయన భక్తులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.