📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgonda108 వాహనంలో ప్రసవం... తల్లి బిడ్డ క్షేమం

108 వాహనంలో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం

📰 Generate e-Paper Clip

*108 వాహనంలో ప్రసవం… తల్లి బిడ్డ క్షేమం*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

108 అంబులెన్స్ లో గర్భిణీ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన ఘటన సోమవారం చండూర్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి చండూరు మండలం ధోనిపాముల గ్రామానికి చెందిన గాదే రాధా కి పురిటి నొప్పులు రావడంతో ఉదయం(గం”04:42:30) సమయంలో గర్భిణి కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు సమాచారమందుకున్న 108 సిబ్బంది (ఈఎంటి) పి.మహేష్ కుమార్ (పైలెట్) బి.రామకృష్ణ 108 వాహనంలో ధోనిపాముల గ్రామానికి చేరుకొని గర్భిణీని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గం మధ్యలో పురిటి నొప్పులు అధికంగా రావడంతో నల్లగొండ సమీపం లో సుమారు ఉదయం 6 గంటల సమయంలో నిండు గర్భిణి పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నప్పటికీ నల్గొండ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడి వైద్యులు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలపడం జరిగింది గర్భిణీకి నార్మల్ డెలివరీ చేసిన 108 సిబ్బంది అయినటువంటి ఈఎంటి పి మహేష్ కుమార్, పైలెట్ బి రామకృష్ణ ను గర్భిణి కుటుంబ సభ్యులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular