📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

సెన్సస్ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన జీపీఓ ప్రేమలతకు బ్రెయిన్ స్ట్రోక్

 

ఘట్‌కేసర్, మే 16 (ప్రజావాణి): ఘట్‌కేసర్ ప్రాంతానికి చెందిన జీపీఓ ఉద్యోగిని ప్రేమలత సెన్సస్ విధులు నిర్వహించి ఇంటికి వెళ్లిన అనంతరం అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురికావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

 

వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.

 

ఈ ఘటన తెలిసిన సహోద్యోగులు, స్థానికులు ప్రేమలత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవల నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రత మధ్య సెన్సస్ విధులు నిర్వహించడం వల్ల ఆమె తీవ్ర ఒత్తిడికి గురై ఉండవచ్చని సహోద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

విధుల ఒత్తిడి, ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular