📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాం

స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాం

📰 Generate e-Paper Clip

ప్రకాశం ప్రజావాణి న్యూస్ ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర (SASA) కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ లో మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి,ప్రతిజ్ఞ ను కూడా చేశారు.పోలీస్ కార్యాలయ ఆవరణను శుభ్రం చేయడంతో పాటు చుట్టుపక్కల చెత్తను తొలగించి,పిచ్చి మొక్కలను గుణపం,పారలతో తీసివేశారు. ఇలా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ,పర్యావరణ పరిరక్షణకు తమ పాత్రను పోషించారు. పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనీ, వస్త్ర సంచులు,జనపనార సంచులు, కాగితపు సంచులు వంటి వాటిని ఉపయోగించాలని,ఒక్కసారి ఉపయోగించి పారేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు ఏళ్ల పాటు ప్రకృతిలో కరుగకుండా ఉండి,మానవజాతికి, వన్యప్రాణులకు,మరియు సముద్ర జీవరాశికి ముప్పుగా మారుతున్నాయని,ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని,మన చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు గారు సూచించారు. మనం తీసుకునే చర్యలు రేపటి తరాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని గుర్తించి, పరిశుభ్రతపై మనం చూపే శ్రద్ధ వారికి మంచి జీవన వాతావరణాన్ని అందించడంలో కీలకమవుతుందన్నారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే విధంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని అందువలన మనసు ప్రశాంతతతో కూడి ఆరోగ్యకర వాతావరణంలో, క్రమశిక్షణగా విధులు నిర్వర్తించొచ్చు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.