స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాం
ప్రకాశం ప్రజావాణి న్యూస్ ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర (SASA) కార్యక్రమంను ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ లో మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది కలిసి స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి,ప్రతిజ్ఞ ను కూడా చేశారు.పోలీస్ కార్యాలయ ఆవరణను శుభ్రం చేయడంతో పాటు చుట్టుపక్కల చెత్తను తొలగించి,పిచ్చి మొక్కలను గుణపం,పారలతో తీసివేశారు. ఇలా శుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ,పర్యావరణ పరిరక్షణకు తమ పాత్రను పోషించారు....