📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో ఆనందం గాగిల్లాపూర్‌లో ఘనంగా గృహ ప్రవేశ కార్యక్రమం

ఇందిరమ్మ ఇంటితో పేద కుటుంబంలో ఆనందం గాగిల్లాపూర్‌లో ఘనంగా గృహ ప్రవేశ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, మే 11 (ప్రజావాణి)

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన మాతంగి సంతోష్‌కు మంజూరైన నూతన ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం లభిస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రల జానకి రాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పైడిపల్లి శంకర్, పులి శ్రీనివాస్, బొమ్మరవేణి సంతోష్, గర్రెపల్లి అంజయ్య, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, సొల్లు బాలయ్య, తడకపల్లి పవన్, న్యాలం శారద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular